![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -44 లో....సింహాద్రికి తన భార్య కాఫీ తీసుకొని వస్తుంది. నాకు కాఫీ వద్దు ఏం వద్దని తనపై సింహాద్రి కోప్పడతాడు. ఎందుకు అలా ఉల్లిక్కిపడుతున్నారని తను అడుగుతుంది. ఓహ్ మొన్న జానూ చేత్తో కాఫీ ఇచ్చినప్పటి నుంచా అని అంటుంది. అప్పుడే శంకర్ ఇంటిని వేళం వేస్తున్నారని మైక్ లో వినిపిస్తుంది. అదంతా సింహాద్రి, తన భార్య వింటారు. పాపం శంకర్ అన్నయ్య మిమ్మల్ని ఎంతగానో నమ్మాడు.. తోటని సొంతం చేసుకున్నారు.. ఆ లోన్ మీరు తీసుకొని వాళ్ళపై తోసారు.. కనీసం ఇల్లు అయినా ఉండనివ్వండి అని తను అంటుంటే.. నోరు ముయ్ ఈ విషయాలన్నీ బయటకు తెలిస్తే చంపేస్తానని తనని లోపలికి పంపిస్తాడు.
మరొకవైపు సూర్య, భువన మీటింగ్ కి వెళ్తారు. నా తర్వాత బిజినెస్ చూసుకునేది నువ్వే కాబట్టి ఇక ప్రతీ మీటింగ్ కి అటెండ్ అవ్వాలని సూర్యతో భువన అంటుంది. అప్పుడే సూర్యకి జానూ ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్తుంది. దాంతో సూర్య కార్ ఆపమని చెప్పి దిగి వెళ్ళిపోతాడు. ఆ జానూ కోసం అమ్మని రోడ్డుపై వదిలేసావని భువన కోపంగా ఉంటుంది. మరొకవైపు జానూ తన కుటుంబాన్ని తీసుకొని ఇంటికి వెళ్తుంది. ఇక్కడ వేళంవద్దు మా ఇల్లుని మాకు దూరం చెయ్యకండి అని గొడవ చేస్తుంది. అక్కడ ఒకతను జానుని నెట్టేస్తాడు. దాంతో జానూ పడిపోతుంటే సూర్య వచ్చి తనని పట్టుకుంటాడు. సూర్య అతనిపై గొడవకి వెళ్తాడు. సూర్య అతనితో గొడవ పడేది సింహాద్రి వీడియో తీస్తాడు. మళ్ళీ గొడవ దగ్గరికి వచ్చి సూర్యని ఆపుతాడు. మేం లీగల్ గా వెళ్తాము.. లాయర్ దగ్గరికి వెళ్తామని సూర్య, జానూ మురళి వాళ్ళు వెళ్తారు. సర్ వాళ్ళు లాయర్ దగ్గరికి వెళ్తే విషయాలు బయటకు వస్తాయని సింహాద్రితో మేనేజర్ అంటాడు. నువ్వేం భయపడకు అని సింహద్రి చెప్తాడు.
మరొకవైపు కళ్యాణ్ ని గౌతమి కలుస్తుంది. నా కోసం వేళంపాటలో పాల్గొని ఇల్లు తీసుకొని నాకు గిఫ్ట్ ఇవ్వమని అంటుంది. పాకెట్ మనీకే మా అమ్మని కాకా పట్టాలి.. ఇంకా అంత డబ్బా.. నా వాళ్ళ కాదని కళ్యాణ్ అంటాడు. మరొకవైపు లాయర్ దగ్గరికి జానూ, సూర్య వెళ్తారు. అన్ని డాక్యుమెంట్స్ కూడా లోన్ తీసుకున్నట్లే ఉన్నాయి ఏం చెయ్యలేమని లాయర్ చెప్తాడు. తరువాయి భాగంలో మా అమ్మ తప్పకుండా హెల్ప్ చేస్తుందని జానూని తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు సూర్య. అమ్మ వాళ్లకి డబ్బు కావాలని అడుగుతాడు వాళ్ళకి జాబ్ లేదు.. మళ్ళీ ఎలా కడుతారని భువన అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |